Inthalo Ennenni Vinthalo Male
14
views
Lyrics
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో సూటిగా నిను చూడలేను తెరచాటుగా నిను చూసాను ఆయువో నువు ఆశవో నువు వీడని తుదిశ్వాసవో రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా ఇంతలో ఎన్నెన్ని వింతలో (ఎన్నెన్ని వింతలో) అలవాటులో పొరపాటులెన్నెన్నో (పొరపాటులెన్నెన్నో) ♪ చిరునవ్వే నీకోసం పుట్టిందనిపిస్తుందే నీ ప్రేమే పంచావో ధన్యం అనిపిస్తుంది పడిపోయానే నే నీకిక, నువు ఎవరైతే అరె ఏంటిక ఉందో లేదో తీరిక, ఈ రేయి ఆగాలిక ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో ♪ పైకెంతో అణకువగా సౌమ్యంగా ఉంటుంది తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది ఆశుందో లేదో ముందుగా, నువు కలిశావో ఇక పండుగ ఉన్నావే నువే నిండుగా, నా కలలకే రంగుగా ఇంతలో ఎన్నెన్ని వింతలో (ఎన్నెన్ని వింతలో) అలవాటులో పొరపాటులెన్నెన్నో (పొరపాటులెన్నెన్నో) సూటిగా నిను చూడలేను (చూడలేను) తెరచాటుగా నిను చూసాన ఆయువో నువు ఆశవో నువు వీడని తుదిశ్వాసవో (తుదిశ్వాసవో) రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో
Audio Features
Song Details
- Duration
- 04:20
- Key
- 4
- Tempo
- 140 BPM