Oke Okkasari
Lyrics
ఒకే ఒక్కసారి నేనున్నాంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ఒకే ఒక్కసారి నేనున్నాంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ఏమైనా నిజంగా నువ్వు నా శ్వాసని నా ఆశే చూస్తుందే నువ్వు వస్తావని ఒకే ఒక్కసారి నేనున్నాంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ♪ పగలు రేయి నీ ధ్యాసే ఉంటూ ఏమి తోచక ఉన్నది పదే పదే నీ మాటలు వింటూ పరవశించాలనున్నది పగలు రేయి నీ ధ్యాసే ఉంటూ ఏమి తోచక ఉన్నది పదే పదే నీ మాటలు వింటూ పరవశించాలనున్నది ఓ హృదయమా పలకరించుమా మెరుపల్లే రాక తెలుపుమా నీ స్నేహమే అందించుమా ఒక చూపుతో ఓదార్చుమా తెలుసుకో నేస్తమా నాలోన ఉన్న స్వరమా ఒకే ఒక్కసారి నేనున్నాంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ♪ ప్రతిక్షణం మది పద పదమంటూ నీ వెంట వస్తున్నది ప్రతీదినం నువ్వు నేనే అంటూ నీ నీడ నాతో అంటున్నది ప్రతిక్షణం మది పద పదమంటూ నీ వెంట వస్తున్నది ప్రతీదినం నువ్వు నేనే అంటూ నీ నీడ నాతో అంటున్నది ఓ మౌనమా మాటాడుమా ఒక ఊసుతో శాసించుమా ఎదలో నీ రూపమే సుమా! నిలువెల్లా చీల్చి చూడుమా చేరుకో ప్రాణమా, నువ్వు లేక నేనుండతరమా ఒకే ఒక్కసారి నేనున్నాంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా ఏమైనా నిజంగా నువ్వు నా శ్వాసని నా ఆశే చూస్తుందే నువ్వు వస్తావని ఒకే ఒక్కసారి నేనున్నాంటు రావా నువ్వే నాలో చేరి నా మనసు తెలుసుకోవా
Audio Features
Song Details
- Duration
- 04:56
- Key
- 8
- Tempo
- 170 BPM