Railu Bandi
Lyrics
క్కు క్కు క్కు గంగోత్రి రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ సరిగమ సరిగమ సరిగమ పదనిస రైలుబండి రైలుబండి నడకలోనే నాట్యం ఉంది నాట్యంలోని జతులన్నీ తకదిమి తకదిమి తకదిమి తకజణు అలసటే లేని సంగీతాన్ని వినిపిస్తుందండి మనుషుల మధ్య దురాలన్ని చెరిపేస్తుందీ రైలుబండి క్కు క్కు క్కు గంగోత్రి కేరళలోన కొబ్బరి నీళ్ళు తాగిస్తుందండీ కర్ణాటక బిసిబెళెబాత్ తినిపిస్తుందండీ ఆంధ్రలోన పెసరట్టు ఉప్మా parcel కట్టించి మహారాష్ట్రాలో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది ఆగ్రా సౌధం చూపించి సిమ్లా apple అందించి హరిద్వారులో అడుగేసి హృషికేష్ లో తిప్పించి గంగోత్రికి చక చకమంటూ పరుగులు తీస్తుంది క్కు క్కు క్కు గంగోత్రి ఎండల్లోన మండుతు ఉన్నా నీడను మనకిచ్చి వానల్లోన తానే తడిసి గొడుగవుతుందండీ రాత్రంతా తను నిద్దరమాని మేల్కోంటుందండీ అమ్మల్లే మనకూయలలుపి జోకొడుతుందండీ సెలవులు తనకు వద్దంటూ స్నేహితులను మనకందిస్తూ అందరి భారం మోసేస్తూ కోరిన తీరం చేరుస్తూ మతమూ కులమను భేదం తనకు లేవంటుందండీ మానవ జాతిని ఒకే తాటిపై నడిపిస్తుందడీ క్కు క్కు క్కు గంగోత్రి (రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ)
Audio Features
Song Details
- Duration
- 03:28
- Key
- 5
- Tempo
- 124 BPM