Nee Yadalo Naaku
3
views
Lyrics
నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చోటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే... నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ధ్యాస లేదే నీ తోటే ప్రేమ పోతేపోనీ అని అబద్దాలు చెప్పలేనులే నీ జతలోన నీ జతలోన ఈ ఎండకాలం నాకు వానాకాలం నీ కలలోన నీ కలలోన మది అలలాగ చేరు ప్రేమ తీరం నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చోటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే... ♪ చిరుగాలి తరగంటి నీమాటకే ఎద పొంగేను ఒక వెల్లువై చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలిపల్లవై ప్రేమ పుట్టాక నాకళ్ళలో దొంగచూపేదో పురివిప్పెనే కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది ఈ సయ్యాట బాగున్నది నువ్వల వేస్తే నువ్వల వేస్తే నా ఎద మారే నా కథ మారే అరె ఇది ఏదో ఒక కొత్త దాహం అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం ♪ ఒకసారి మౌనంగ నను చూడవే ఈ నిమిషమే యుగమౌనులే నీ కళ్ళలో నన్ను బందించవే ఆ చెర నాకు సుఖమౌనులే నిన్ను చూసేటి నా చూపులో కరిగే ఎన్నెన్ని మునిమాపులో పసిపాపై ఇలా నా కనుపాపలే నీ జాడల్లో దోగాడెనే తొలి సందెలలో తొలి సందెలలో ఎరుపే కాదా నీకు సింధూరం మలి సందెలలో మలి సందెలలో నీ పాపిటిలో ఎర్రమందారం నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చోటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే... నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ధ్యాస లేదే నీ తోటే ప్రేమ పోతేపోనీ అని అబద్దాలు చెప్పలేనులే
Audio Features
Song Details
- Duration
- 04:52
- Tempo
- 105 BPM