Nannu Lalinchu ( Solo )
7
views
Lyrics
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి, ఈ నేల నిప్పే నువ్వా లేక నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా ♪ నదిలాగ నీవు కదలాడుతుంటే నీతోపాటు సాగేతీరం నేనవ్వనా నిశిరాత్రి నీవు, నెలవంక నేను నీతోపాటు నిలిచే కాలం చాలందునా మొగ్గై ఎదురొచ్చి వనముగ మారావు కలలే నాకిచ్చి కనులను దోచావు ఎద లయలోన లయవయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వు నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా ♪ భువిలోన గాలి కరువైన వేళ నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా నీలాల నింగి తెలవారకుంటే నా జీవాన్ని నీకు దివ్వెగ అందించనా శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా అలలా నువు రాగా అలజడినౌతున్నా దీపం నువ్వైతే నీ వెలుగు నేనవ్వనా నీలో సగమవ్వనా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి, ఈ నేల నిప్పే నువ్వా లేక నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా
Audio Features
Song Details
- Duration
- 04:42
- Key
- 7
- Tempo
- 78 BPM