Buttabomma - Telugu

Lyrics

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము
 ఈ లవ్వనేది బబ్లు గమ్ము
 అంటుకున్నాదంటే పోదు నమ్ము
 ముందు నుంచి అందరన్నమాటే గాని మళ్లీ అంటున్నానే అమ్ము
 ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము
 ప్రేమనాపలేవు నన్ను నమ్ము
 ఎట్టగా అనే ఎదురు చూపుకి
 తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
 అరె దేవుడా ఇదేందనేంత లోపటే
 పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే
 బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే
 జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూకుంటివే
 బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే
 జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూకుంటివే
 ♪
 Multiplex లోని audience లాగా మౌనంగున్నాగాని అమ్ము
 లోన డండనక జరిగిందే నమ్ము
 దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము
 ♪
 రాజుల కాలం కాదు
 రథము, గుర్రం లేవు
 అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే
 గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు
 చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే
 చిన్నగా చినుకు తుంపరడిగితే
 కుండపోతగా తుఫాను తెస్తివే
 మాటగా ఓ మల్లెపువ్వునడిగితే
 మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే
 బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే
 జిందగీకే అట్టబొమ్మై జంట కట్టూకుంటివే
 వేలినిండా నన్ను తీసి బొట్టుపెట్టూకుంటివే
 కాలి కింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే
 ♪
 ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము
 ఈ లవ్వనేది బబ్లు గమ్ము
 అంటుకున్నాదంటే పోదు నమ్ము
 ముందు నుంచి అందరన్నమాటే గాని మళ్లీ అంటున్నానే అమ్ము
 ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము
 ప్రేమనాపలేవు నన్ను నమ్ము
 

Audio Features

Song Details

Duration
03:18
Key
11
Tempo
115 BPM

Share

More Songs by Armaan Malik

Albums by Armaan Malik

Similar Songs