Swathilo Muthyamantha (From "Bangaru Bullodu")

2 views

Lyrics

(వానా వానా వచ్చేనంట)
 (వాగు వంకా మెచ్చేనంట)
 (తీగా డొంకా కదిలేనంట)
 (తట్టాబుట్టా తడిసేనంట)
 (ఎండా వానా పెళ్ళాడంగా)
 (కొండా కోనా నీళ్ళాడంగా)
 (కృష్ణా గోదారమ్మ కలిసి)
 (పరవళ్ళెత్తి పరిగెత్తంగా)
 (వానా వానా వచ్చేనంట)
 (వాగు వంకా మెచ్చేనంట)
 ♪
 స్వాతిలో ముత్యమంతా ముద్దులా
 ముట్టుకుంది సంధ్య వాన
 సందెలో చీకటంతా సిగ్గులా
 అంటుకుంది లోనలోనా
 అల్లో మల్లో
 అందాలెన్నో యాలో యాల
 ♪
 స్వాతిలో ముత్యమంతా ముద్దులా
 ముట్టుకుంది సంధ్య వాన
 సందెలో చీకటంతా సిగ్గులా
 అంటుకుంది లోనలోనా
 ♪
 తాకిడి పెదవుల మీగడ తరకలు
 కరిగే వేళ
 మేనక మెరపులు
 ఊర్వశి ఉరుములు కలిసేనమ్మ
 కోకకు దరువులు రైకకు బిగువులు
 పెరిగే వేళ
 శ్రావణ సరిగమ
 యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ
 వానా వానా వల్లప్పా
 వాటేస్తేనే తప్పా
 సిగ్గు యెగ్గూ చెల్లెప్పా
 కాదయ్యో నీ గొప్ప
 నీలో మేఘం నాలో
 దాహం యాలో యాల
 స్వాతిలో ముత్యమంతా ముద్దులా
 ముట్టుకుంది సంధ్య వాన
 సందెలో చీకటంతా సిగ్గులా
 అంటుకుంది లోనలోనా
 ♪
 వానా వానా వచ్చేనంట
 వాగు వంకా మెచ్చేనంట
 తీగా డొంకా కదిలేనంట
 తట్టాబుట్టా తడిసేనంట
 ఎండా వానా పెళ్ళాడంగా
 కొండా కోనా నీళ్ళాడంగా
 కృష్ణా గోదారమ్మ కలిసి
 పరవళ్ళెత్తి పరిగెత్తంగా
 తుమ్మెద చురకలు తేనెల మరకలు
 కడిగే వాన
 తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు
 వణికే వాన
 జన్మకు దొరకని మన్మధ తళుకులు
 ముదిరే వాన
 చాలని గొడుగున నాలుగు అడుగుల
 నటనే వానా
 వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగ
 గాలి వాన గుళ్ళోనా
 ముద్దే లే జేగంట
 నాలో రూపం, నీలో తాపం
 యాలో యాల
 స్వాతిలో ముత్యమంతా ముద్దులా
 ముట్టుకుంది సంధ్య వాన
 సందెలో చీకటంతా సిగ్గులా
 అంటుకుంది లోనలోనా
 అల్లో మల్లో
 అందాలెన్నో యాలో యాల
 (వానా వానా వచ్చేనంట)
 (వాగు వంకా మెచ్చేనంట)
 (తీగా డొంకా కదిలేనంట)
 (తట్టాబుట్టా తడిసేనంట)
 (ఎండా వానా పెళ్ళాడంగా)
 (కొండా కోనా నీళ్ళాడంగా)
 (కృష్ణా గోదారమ్మ కలిసి)
 (పరవళ్ళెత్తి పరిగెత్తంగా)
 

Audio Features

Song Details

Duration
05:13
Key
2
Tempo
91 BPM

Share

More Songs by S. P. Balasubrahmanyam'

Similar Songs