Tiya Tiyani Kalalanu
Lyrics
తియతియ్యని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ కౌగిళ్ళలో నేనెవరన్నది నే మరిచిపోగలను చూస్తూ నీ కళ్ళలో తియతియ్యని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ♪ చలచల్లని మంచుకు అర్థమేకాదు ప్రేమ చలవేమిటో నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో వచ్చీరాని కన్నీళ్లకే తెలుసు ప్రేమ లోతేమిటో ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటో తియతియ్యని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ♪ మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీవేళలో తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో తియతియ్యని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
Audio Features
Song Details
- Duration
- 03:44
- Key
- 7
- Tempo
- 160 BPM