Ye Mantramo

Lyrics

ఏ మంత్రమో అల్లేసిందిలా
 ఎదకే వేసే సంకెళ
 భూమెందుకో వణికిందే ఇలా
 బహుశా తనలో తపనకా
 ఆకాశం రూపం మారిందా
 నాకోసం వానై జారిందా
 గుండెల్లో ప్రేమై చేరిందా
 ఆ ప్రేమే నిన్నే కోరిందా
 మబ్బుల్లో ఎండమావే
 ఎండంతా వెన్నెలాయే
 మనసంతా మాయమాయే
 అయినా హాయే
 క్షణము ఒక ఋతువుగ మారే
 ఉరుము ప్రతి నరమును తరిమే
 పరుగులిక వరదలైపోయే కొత్తగా
 ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే
 పగలు వల విసిరే ఊహలే
 మనసు మతి చెదరగ శిలగా నిలిచెగా
 కళ్ళల్లో కదిలిందా
 కలగా కళ కరిగిపోకలా
 ఎదురయ్యే వేళల్లో
 నువ్వు ఎగిరిపోకలా
 ఓ మాయలా ఇంకో మాయలా
 నన్నంత మార్చేంతలా
 ఒఓ మాయలా ఇంకో మాయలా
 నువ్వే నేనయ్యేంతలా, వెన్నెల్లా
 

Audio Features

Song Details

Duration
02:47
Key
8
Tempo
90 BPM

Share

More Songs by Bobo Shashi

Albums by Bobo Shashi

Similar Songs