Prayathname
Lyrics
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపే ఏమైనా... మధ్యలో వదలొద్దురా నీ సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ఓ' ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే వెళ్ళే దారుల్లోన రాళ్ళే అడ్డొస్తున్నా అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి అడుగంటూ వేసాక... ఆగకుండా సాగాలిరా నీ సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ఓ' ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
Audio Features
Song Details
- Duration
- 02:47
- Key
- 9
- Tempo
- 96 BPM